మండలాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి
-జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 17: మెదక్ జిల్లా (16) జిల్లా ప్రజల సమస్యలను స్థానికంగానే పరిష్కరించేందుకు ఆగస్టు 17వ తేదీ నుంచి ప్రతి సోమవారం అన్ని మండలాల ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు, వినతులను మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల మండలస్థాయి...