Thursday, July 30, 2026
Homeమెదక్మహిళలు, బాలికల భద్రతకు మెదక్ షీ టీం నిరంతర కృషి

మహిళలు, బాలికల భద్రతకు మెదక్ షీ టీం నిరంతర కృషి

📰 Generate e-Paper Clip

జిల్లాలో 71 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కౌన్సెలింగ్.. 12 ఈ-పెట్టీ కేసులు నమోదు

జిల్లా వ్యాప్తంగా 42 అవగాహన కార్యక్రమాల నిర్వహణ

వేధింపులకు గురైతే వెంటనే షీ టీంను సంప్రదించండి: మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

A2న్యూస్, జులై 1, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ (30) మహిళలు, బాలికల భద్రతకు మెదక్ జిల్లా పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. మహిళలపై వేధింపులు, ఈవ్‌టీజింగ్, అసభ్య ప్రవర్తన, సైబర్ వేధింపుల నివారణకు షీ టీం నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ చర్యలు చేపడుతోందన్నారు.జూన్ నెలలో షీ టీం నిర్వహించిన ప్రత్యేక తనిఖీలు, నిఘా చర్యల్లో మొత్తం 71 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్పీ వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన మరో 12 మందిపై ఈ-పెట్టీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.మహిళలు, బాలికల్లో చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా 42 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. విద్యాసంస్థలు, ప్రజా ప్రదేశాల్లో జరిగిన ఈ కార్యక్రమాల్లో మహిళల భద్రత, అత్యవసర సేవలు, షీ టీం సేవలు, సైబర్ నేరాల నివారణ తదితర అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించినట్లు చెప్పారు.మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే షీ టీం లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడంతో పాటు, బాధితులకు తక్షణ సహాయం అందించి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.మహిళల భద్రత కోసం ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని, వేధింపుల సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.క్ (30)హిళలు, బాలికల భద్రతకు మెదక్ జిల్లా పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. మహిళలపై వేధింపులు, ఈవ్‌టీజింగ్, అసభ్య ప్రవర్తన, సైబర్ వేధింపుల నివారణకు షీ టీం నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ చర్యలు చేపడుతోందన్నారు.జూన్ నెలలో షీ టీం నిర్వహించిన ప్రత్యేక తనిఖీలు, నిఘా చర్యల్లో మొత్తం 71 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్పీ వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన మరో 12 మందిపై ఈ-పెట్టీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.మహిళలు, బాలికల్లో చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా 42 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. విద్యాసంస్థలు, ప్రజా ప్రదేశాల్లో జరిగిన ఈ కార్యక్రమాల్లో మహిళల భద్రత, అత్యవసర సేవలు, షీ టీం సేవలు, సైబర్ నేరాల నివారణ తదితర అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించినట్లు చెప్పారు.మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే షీ టీం లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడంతో పాటు, బాధితులకు తక్షణ సహాయం అందించి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.మహిళల భద్రత కోసం ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని, వేధింపుల సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!