Friday, August 14, 2026
Homeమెదక్కల్తీవి తినకండి..క్యాన్సర్ ఎదురుచూస్తోంది..!

కల్తీవి తినకండి..క్యాన్సర్ ఎదురుచూస్తోంది..!

📰 Generate e-Paper Clip

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 13:

నర్సాపూర్ (12) కల్తీ ఆహార పదార్థాలు తినవద్దని లేకపోతే క్యాన్సర్ బారిన పడక తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. వినియోగానికి అనుగుణంగా ఉత్పత్తి లేదని ఆందోళన వ్యక్తం చేసింది. మనదేశంలో కారం, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పాలు ఇలాంటివన్నీ మొత్తం కల్తీ బారిన పడుతున్న విషయం తెలిసిందే. మిరియాలు బొప్పాయి పండ్ల గింజలు, పసుపు కారం లో సన్నని రంపం పొట్టుతో కలర్ పూసి కల్తీ చేయడం, అల్లం వెల్లుల్లి పేస్టులో అనారోగ్యానికి చేటు చేసే పదార్థాలను కలుపుతూ ఇవేఒరిజినల్, నాణ్యమైనవి అన్నట్టుగా మార్కెట్లో చెలామణి అవుతున్నాయి. దీని ద్వారా అసలుకు నకిలీకి గుర్తుపట్టలేనంత గా ఈ నకిలీ వ్యాపారం సాగుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తరుణం ఇది. ఇలాంటి ఆహార పదార్థాలు తింటే అనారోగ్యం బారిన పడక తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. ఇక మంచి నూనె ఎంత కల్తీ అవుతుందో అందరికీ తెలుసు. మళ్లీ దాన్ని రకరకాల రసాయనాలు కలిపి ఫిల్టర్ చేసి ఇది అత్యంత నాణ్యమైంది అన్నట్టుగా మార్కెట్లో అమ్మకాలు సాగిస్తున్నారు అక్రమ వ్యాపారులు. కల్తీ నూనె తినడం వల్ల గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇక పాల కల్తీ చెప్పాల్సిన అవసరం లేదు. మన భారతదేశంలో ఒక రోజుకు 64 కోట్ల లీటర్ల పాల వినియోగంజరుగుతుండగా ఉత్పత్తి మాత్రం 14 కోట్ల లీటర్లు జరుగుతుంది. అయినా పాలు పాల పదార్థాల నుండి వచ్చే ఉత్పత్తులు అన్నీ కూడా మార్కెట్ డిమాండ్ కనుగునంగానే లభ్యమవుతున్నాయి.  ఈ ఒక్క ఉదాహరణ చాలు కల్తీ ఎంతవరకు ఏ మేరకు జరుగుతుంది మన ఆరోగ్యాలు ఎంత ప్రమాదంలో ఉన్నాయో తెలుసుకోవడానికి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ గణాంకాలనే లెక్కలోకి తీసుకొని ఇది ఇలాగే కొనసాగితే 2035 నాటికి 87 శాతం మంది భారతీయులకు క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తుంది. దేశంలో అమ్ముడయ్యే పాలు పాల ఉత్పత్తుల్లో 68.7%కల్తీచేయబడినవేనని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రమాణాలకుఅనుగుణంగా ఏమీ లేవని పశు సంక్షేమ బోర్డు సభ్యులు మోహన్ సింగ్ఆహ్లూవాలియా పేర్కొనడం ఆందోళన కలిగించే విషయం. ఆవులు, గేదెలు వద్దు పాల పెరుగుకావాలి,వ్యవసాయం వద్దు అన్నం, తాజా కూరగాయలు కావాలి అంటే కల్తీ బారిన పడక తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం ప్రకటించింది. సాధ్యమైనంత వరకు ఇంట్లో చేసిన పదార్థాలకే ప్రాధాన్యత నివ్వాలని కల్తీ పాలు పాల పదార్థాలు, ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది. మినరల్ వాటర్ కూడా ఆరోగ్యానికి అంత శ్రేయస్కరం కాదని నొక్కి వక్కాణిస్తుంది. అంతేకాదు ఇది ఇలాగే కొనసాగితే ఇప్పుడు ఆహార పదార్థాలు కొనాల్సిన మనం ముందు ముందు ఆరోగ్యాన్ని కొనుక్కోడానికి ఖర్చు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తుందని దీనిపట్ల ప్రతి ఒక్కరుఆప్రమంతంగా ఉండాలని ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!