Friday, August 14, 2026
Homeమెదక్వనదుర్గ భవాని ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏర్పాటు

వనదుర్గ భవాని ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏర్పాటు

📰 Generate e-Paper Clip

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 14:

మెదక్ జిల్లా (13) మెదక్ పట్టణంలోని టీఎన్జీవో భవన్‌లో గురువారం వనదుర్గ భవాని ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా నాచారం చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షుడిగా రాజ్‌కుమార్, ఉపాధ్యక్షులుగా అబ్రహం, తిగిట సాయిరాం, చింతల సిద్దు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఎస్. రాము, సహాయ కార్యదర్శులుగా నరేష్ యాదవ్, సైఫదిన్, కోశాధికారిగా మహేష్ బాధ్యతలు చేపట్టారు. ముఖ్య సలహాదారులుగా ఆకుల పెంటయ్య, ఆంజనేయులు, జయరాజ్తో పాటు పలువురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నాచారం చంద్రశేఖర్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. అదేవిధంగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ప్రెస్ క్లబ్ బాధ్యతాయుతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ప్రెస్ క్లబ్‌ను మరింత బలోపేతం చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!