Wednesday, September 16, 2026
Homeమెదక్మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కుల పంపిణీ

మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కుల పంపిణీ

📰 Generate e-Paper Clip

A2న్యూస్, జూలై 25, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

హోంగార్డు కుటుంబాల సంక్షేమానికి పోలీస్ శాఖ అండగా ఉంటుంది : మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

మెదక్ జిల్లా(24) విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హోంగార్డు ఎం. శివరాం, గుండెపోటుతో మృతిచెందిన హోంగార్డు టీ. మహేందర్ కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మృతుల కుటుంబ సభ్యులకు చెక్కులను అందించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, హోంగార్డు కుటుంబాల సంక్షేమానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. మృతుడు శివరాం కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఆయన, పిల్లల విద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. శివరాం కుమారుడు బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న విషయం తెలుసుకుని, అతని విద్యార్హతలు, ఇతర వివరాలను సేకరించి ఉద్యోగం కల్పించే విషయంలో తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మహేందర్ భార్య ప్రస్తుతం ఎలాంటి ఉపాధి లేక ఇంటివద్దే ఉంటున్న విషయం తెలుసుకున్న ఎస్పీ, ఆమె విద్యార్హతలు, ఉద్యోగ అవకాశాలపై ఆరా తీశారు. ఆమెకు ఉపాధి కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు పోలీస్ శాఖ తరఫున అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆర్‌ఐ శైలేందర్, ఆర్‌ఎస్‌ఐ నరేష్, రైటర్ శ్రావణ్, మృతుల కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.తో మృతిచెందిన హోంగార్డు టీ. మహేందర్ కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మృతుల కుటుంబ సభ్యులకు చెక్కులను అందించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, హోంగార్డు కుటుంబాల సంక్షేమానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. మృతుడు శివరాం కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఆయన, పిల్లల విద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. శివరాం కుమారుడు బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న విషయం తెలుసుకుని, అతని విద్యార్హతలు, ఇతర వివరాలను సేకరించి ఉద్యోగం కల్పించే విషయంలో తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మహేందర్ భార్య ప్రస్తుతం ఎలాంటి ఉపాధి లేక ఇంటివద్దే ఉంటున్న విషయం తెలుసుకున్న ఎస్పీ, ఆమె విద్యార్హతలు, ఉద్యోగ అవకాశాలపై ఆరా తీశారు. ఆమెకు ఉపాధి కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు పోలీస్ శాఖ తరఫున అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆర్‌ఐ శైలేందర్, ఆర్‌ఎస్‌ఐ నరేష్, రైటర్ శ్రావణ్, మృతుల కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!