Thursday, October 15, 2026
Homeమెదక్దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి

దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి

📰 Generate e-Paper Clip

బస్ పాస్‌ల జారీలో ఆధార్, సదరం          సర్టిఫికెట్, ఫొటోను తప్పనిసరిగా పరిశీలించాలి

తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం అధ్యక్షులు కెమ్మసారం అశోక్

A2న్యూస్, మెదక్/సిద్దిపేట్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 24:

మెదక్ /సిద్దిపేట జిల్లా(23) తెలంగాణ: దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్‌కు సంఘం తరఫున విజ్ఞప్తి చేసినట్లు సంఘం అధ్యక్షులు కెమ్మసారం అశోక్ తెలిపారు. అదేవిధంగా దివ్యాంగులు తమ సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఫొటో వంటి ముఖ్యమైన పత్రాలను జిరాక్స్ సెంటర్లు, కార్యాలయాలు తదితర ప్రాంతాల్లో ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు. దివ్యాంగుల సదరం సర్టిఫికెట్లను దుర్వినియోగం చేస్తూ కొంతమంది సకలాంగులు బస్ పాస్ సౌకర్యాన్ని పొందుతున్నారనే విషయం సంఘం దృష్టికి వచ్చినట్లు అశోక్ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు బస్ పాస్ జారీ చేసే సమయంలో సంబంధిత అధికారులు మరింత జాగ్రత్త వహించాలని కోరారు. బస్ పాస్ జారీ చేసే సమయంలో దరఖాస్తుదారుడి సదరం సర్టిఫికెట్, ఆధార్ నంబర్, ఫొటో తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అవి సంబంధిత వ్యక్తివేనా కాదా నిర్ధారించిన అనంతరం మాత్రమే పాస్ జారీ చేయాలని డిపో మేనేజర్లు, బస్ పాస్‌లను జారీ చేసే సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం అధ్యక్షులు కెమ్మసారం అశోక్ కోరారు. దివ్యాంగుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!