428 ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేత
రైతులకు రూ.786.06 కోట్ల చెల్లింపులు పూర్తి
– జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, జూన్ 15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ :(14) జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరుకుందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 91,577 మంది రైతుల నుంచి 4,03,545.040 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి 73,429 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.786.06 కోట్ల చెల్లింపులు పూర్తిచేసినట్లు తెలిపారు. ధాన్యం సేకరణ పూర్తయిన నేపథ్యంలో జిల్లాలోని 428 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే మూసివేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన కొనుగోలు ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ భరోసా ఇచ్చారు.

