Thursday, July 30, 2026
Homeమెదక్ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్‌ను పకడ్బందీగా అమలు చేయాలి

ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్‌ను పకడ్బందీగా అమలు చేయాలి

📰 Generate e-Paper Clip

మెదక్ జిల్లాలో 67.06 శాతం ఎస్ ఐ ఆర్  నమోదు – జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, జూలై 16, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా (15) ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ ఐ ఆర్ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ, మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 67.06 శాతం ఎస్ ఐ ఆర్ నమోదు పూర్తయ్యిందని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా, అనర్హుల పేర్లను నిబంధనల ప్రకారం తొలగించే ప్రక్రియను కచ్చితంగా నిర్వహించాలని సూచించారు. ఇంటింటి సర్వే, ఫీల్డ్ వెరిఫికేషన్, దరఖాస్తుల పరిశీలన వంటి ప్రతి దశను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని పేర్కొన్నారు. బూత్ స్థాయి అధికారులు బి ఎల్ ఓ లు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అందిన దరఖాస్తులను ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ఓటరు జాబితా స్వచ్ఛతను కాపాడేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయం కొనసాగిస్తూ పూర్తి పారదర్శకతతో విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులను తప్పనిసరిగా పాటిస్తూ ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!