A2న్యూస్, జూలై 17, ప్రత్యేక ప్రతినిధి (మల్పర్తి రాంచందర్)
హైదరాబాద్ (16) తెలుగు సినిమా రంగంలో ప్రయోగాల దర్శకుడు, నిత్య ప్రయోగ శీలిగా పేరుపొందిన డాక్టర్ పి.సి. ఆదిత్యను మరో డాక్టరేట్ అవార్డు వరించింది. గత 30 సంవత్సరాలుగా చేస్తున్న సేవలను, ప్రయోగాలు ను గుర్తించి న్యూ మెక్సికో యుఎస్ఏ కు చెందిన వరల్డ్ టెక్నాలజీ రీసెర్చ్ & డెవలప్మెంట్ కౌన్సిల్ వారు పీసీ ఆదిత్య కు గౌరవ డాక్టరేట్ ను అందించారు. పీసీ ఆదిత్య గౌరవ డాక్టరేట్ అందుకోవడం ఇది రెండవ సారి… పదేళ్ల క్రితం సింగపూర్ ఓపెన్ యూనివర్సిటీ డాక్టరేట్ అందజేశారు. ఇప్పుడు రెండవ సారి. ఈ సందర్బంగా పీసీ ఆదిత్య స్పందిస్తూ తన సుదీర్ఘ సినీ ప్రయాణం లో అత్యున్నత గౌరవ డాక్టరేట్ ను అందుకోవడం తన ప్రయోగాలకు మరింత ఉత్సాహం ని ఇచ్చిందని, భవిష్యత్ లో మరికొంత మందిని సినీ రంగానికి పరిచయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆదిత్య మరోసారి గౌరవ డాక్టరేట్ అందుకోవడం పట్ల ఆయన అభిమానులు మిత్రులు శుభాకాంక్షలు తెలియజేసారు.

