A2న్యూస్, నర్సాపూర్ కొల్చారం ప్రతినిధి (బుచ్చన్న) సెప్టెంబర్ 10:
నర్సాపూర్ ( కొల్చారం) (9) నర్సాపూర్ నియోజకవర్గ కొల్చారం మండలంలోని రంగంపేట గ్రామపంచా యతీ వద్ద డిసిఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన సింధు హాస్పిటల్ వారిచే నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో గుండెకు సంబంధించిన వ్యాధులు, గైనకాలజిస్ట్, షుగర్ ,బిపి పరీక్షలు రక్త పరీక్షలు, గర్భిణీ స్త్రీలకు సంబంధించిన పరీక్షలు, క్యాన్సర్ కు సంబంధించిన పరీక్షలు జనరల్ మెడిసిన్ సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. అలాగే మెరుగైన వైద్య చికిత్స అవసర నిమిత్తం హైదరాబాద్ సింధు హాస్పిటల్కు రెఫర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వర్ణలత విజయకుమార్ ఉపసర్పంచ్ చిట్కుల సురేష్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ వంజరి మల్లేశం, హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ విజయ్ కుమార్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు

