Thursday, September 17, 2026
Homeమెదక్ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా బయో లిక్విడ్ పిచికారి

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా బయో లిక్విడ్ పిచికారి

📰 Generate e-Paper Clip

A2న్యూస్, నర్సాపూర్ (కొల్చారం) ప్రతినిధి (బుచ్చన్న) సెప్టెంబర్ 16:

మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో సర్పంచ్ దేవన్న గారి శేఖర్ ఆధ్వర్యంలో బయో లిక్విడ్  గ్రామంలోని వీధులు ప్రధాన వీధులలో బురద నీటి గుంతలు  వద్ద పిచికారి చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ దేవన్న గారి శేఖర్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులు సోకకుండా ప్రజల ఆరోగ్యం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అలాగే ఈ పికారీ చేయించడం వల్ల దోమల నివారణ పూర్తిగా అవుతుందని గ్రామ వ్యాప్తంగా దోమల యొక్క లార్వా చనిపోయి దోమలు వృద్ధి చెందకుండా ప్రజలు వ్యాధుల బారిన పడకుండా సుభిక్షంగా ఉంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కారోబార్ ప్రభాకర్ వార్డు సభ్యులు పంచాయతీ కార్మిక సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!