Thursday, September 17, 2026
Homeమెదక్సాంస్కృతిక సారథి జిల్లా అధ్యక్షుడిగా కొమ్ముల శేఖర్ గౌడ్

సాంస్కృతిక సారథి జిల్లా అధ్యక్షుడిగా కొమ్ముల శేఖర్ గౌడ్

📰 Generate e-Paper Clip

A2న్యూస్, నర్సాపూర్ (కొల్చారం) ప్రతినిధి (బుచ్చన్న) సెప్టెంబర్ 16:

కొల్చారం (15) తెలంగాణ సాంస్కృతిక సారథి పిలుపు, ఆదేశాల మేరకు మెదక్ జిల్లా కొల్చారం మండలం ఏడుపాయలలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని సాంస్కృతిక సారథులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు. అనంతరం మెదక్ జిల్లా సాంస్కృతిక సారథి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కమిటీకి గౌరవ అధ్యక్షుడిగా శివ్వొల్ల కృష్ణ, జిల్లా అధ్యక్షుడిగా కొమ్ముల శేఖర్ గౌడ్, కార్యదర్శిగా నేనావత్ మదన్ సింగ్, కోశాధికారిగా కారంగుల మాధవి, ఉపాధ్యక్షుడిగా ధరావత్ రాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులు తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సాంస్కృతిక సారథులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!