రివైజ్డ్ షెడ్యూల్‌ను పకడ్బందీగా అమలు చేయాలి : జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 9:
మెదక్ జిల్లా (8) భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (Special Intensive Revision–2026) షెడ్యూల్‌ను సవరించినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, ప్రజలకు మరింత అవకాశం కల్పించే ఉద్దేశంతో క్లెయిమ్స్, అభ్యంతరాల దాఖలు గడువును సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 7 వరకు పొడిగించినట్లు ఆమె వెల్లడించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు తమ పేరు ఓటరు జాబితాలో నమోదు చేయించుకోవడం, మార్పులు, తొలగింపులు, సవరణలు, చిరునామా మార్పు వంటి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లు తప్పనిసరిగా విచారణకు హాజరై తమ వివరాలను సరిచేసుకోవాలని కోరారు.
సవరించిన షెడ్యూల్
• క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ: ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 వరకు • నోటీసుల జారీ, విచారణలు, క్లెయిమ్స్-అభ్యంతరాల పరిష్కారం: ఆగస్టు 17 నుంచి నవంబర్ 5 వరకు • తుది ఓటరు జాబితా ప్రచురణ: నవంబర్ 9జిల్లాలోని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈ ఆర్ ఓలు) అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఏ ఈ ఆర్ ఓ లు), సూపర్వైజర్లు, బూత్ లెవల్ అధికారులు (బి ఎల్ ఓ లు) సవరించిన షెడ్యూల్‌ను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్ర పరిధిలో సవరించిన షెడ్యూల్‌పై విస్తృత ప్రచారం నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్‌ఐఆర్-2026 కార్యక్రమ పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు.

