Friday, July 31, 2026
Homeమెదక్జీవో నెంబర్ 25 కి వ్యతిరేకంగా నిరసన

జీవో నెంబర్ 25 కి వ్యతిరేకంగా నిరసన

📰 Generate e-Paper Clip

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) జూలై 30:

నర్సాపూర్ (29) జీవో నెంబర్ 25 వెంటనే సవరణ చేయాలని ఎస్జీ టీయూ ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బుధవారం నర్సాపూర్ పాఠశాలలో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం లో భాగంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్జీ టీయూ మండల అధ్యక్షులు మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి విద్యను బలోపేతం చేయాలని, జీవో నెంబర్ 25 వెంటనే సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ జి టి యు మండల అధ్యక్షులు గణేష్, ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులు కళా రాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు రవికుమార్, మహిళాఉపాధ్యాయురాలు రామేశ్వరి, అరుణ, అనిత, సునీత, హైమావతి, మంజుల తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!