Friday, July 31, 2026
Homeమెదక్ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

— డీఆర్ఓ అంబాదాస్ రాజేశ్వర్

A2 న్యూస్, జూన్ 23, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా :(22) జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) అంబాదాస్ రాజేశ్వర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి మొత్తం 100 దరఖాస్తులు స్వీకరించారు. వాటిలో భూభారతి సమస్యలకు సంబంధించిన 40, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన 23, పెన్షన్ అంశాలకు సంబంధించిన 4, ఇతర సమస్యలకు సంబంధించిన 33 దరఖాస్తులు ఉన్నాయి.ఈ సందర్భంగా డీఆర్ఓ అంబాదాస్ రాజేశ్వర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు ప్రాధాన్యతగా తీసుకుని, సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు న్యాయం జరిగేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!