A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 16:
నర్సాపూర్ (15) స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా నర్సాపూర్ మున్సిపల్ కు చెందిన ఉత్తమ ఉద్యోగి, ఉత్తమ వర్కర్ గా రెండు అవార్డులు వరించాయి. ఉత్తమ ఉద్యోగిగా 9, 11, 13 వార్డులకు వార్డు అధికారిగా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్, ఉత్తమ వర్కర్ గా నీరుడి పోచయ్యలుఎన్నికయ్యారు. ఈ మేరకు వీరు జిల్లా కేంద్రమైన మెదక్ లో కలెక్టర్ ప్రతిమసింగ్, ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. వీరిని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్, కమిషనర్ సాయికుమార్, కౌన్సిలర్లు, అధికారులు తోటి సిబ్బంది అభినందించారు.

