Friday, July 31, 2026
Homeమెదక్క్యాట్రియల్ గ్రామంలో ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు విస్తృత పర్యటన

క్యాట్రియల్ గ్రామంలో ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు విస్తృత పర్యటన

📰 Generate e-Paper Clip

A2 న్యూస్, జూన్ 25, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

  1. మెదక్, 24: మెదక్ నియోజకవర్గం రామయంపేట్ మండలం క్యాట్రియల్ గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎం.ఎస్.ఎస్.వో సంస్థ ఆధ్వర్యంలో ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేసిన బోర్ మోటార్లను ప్రారంభించి గ్రామ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టారు.పేట్ మండలం క్యాట్రియల్ గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎం.ఎస్.ఎస్.వో సంస్థ ఆధ్వర్యంలో ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేసిన బోర్ మోటార్లను ప్రారంభించి గ్రామ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టారు.అనంతరం గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులకు అందజేసి వారి ఆనందంలో భాగస్వాములయ్యారు. గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, మండల నాయకులు మరియు గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ, క్యాట్రియల్ గ్రామ అభివృద్ధికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్) నిధులతో పాటు ఎస్‌డీఎఫ్ నిధుల ద్వారా కమ్యూనిటీ హాల్, ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లను మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామంలోని మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.గ్రామాభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, గ్రామాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!