వివిధ సమస్యలపై 85 దరఖాస్తుల స్వీకరణ
A2న్యూస్, జూలై 21, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ (20) మెదక్ కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా హెల్ప్‌డెస్క్ ద్వారా ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన మొత్తం 85 దరఖాస్తులు స్వీకరించారు. సోమవారం ఉమ్మడి జిల్లా ఎల్-నినో ప్రభావంపై నిర్వహించిన మంత్రివర్గ సమావేశానికి జిల్లా కలెక్టర్‌తో పాటు పలువురు జిల్లా శాఖల అధికారులు సంగారెడ్డి కలెక్టరేట్‌కు వెళ్లిన నేపథ్యంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో హెల్ప్‌డెస్క్ ద్వారా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి అందిన 85 వినతులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని హెల్ప్‌డెస్క్ సిబ్బంది తెలిపారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని వారు పేర్కొన్నారు.

