A2న్యూస్, జూలై 20, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా (19) ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన గ్రీవెన్స్ దరఖాస్తులను హెల్ప్ డెస్క్ ద్వారా స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20వ తేదీన సంగారెడ్డిలో ఉమ్మడి జిల్లా మంత్రివర్యుల సమావేశం నిర్వహించనున్నందున, జిల్లా కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు సమావేశానికి హాజరు కానున్నారు. దీంతో ఆ రోజు కలెక్టరేట్‌లో అధికారులు అందుబాటులో ఉండరని పేర్కొన్నారు. ఈ కారణంగా ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజల నుంచి గ్రీవెన్స్ దరఖాస్తులను హెల్ప్ డెస్క్ ద్వారా స్వీకరించి, అనంతరం సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ విజ్ఞప్తి చేశారు.

