Sunday, September 13, 2026
Homeమెదక్మంగళపర్తి లోఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు... బహుజన పోరాటాలకు ప్రతీక

మంగళపర్తి లోఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు… బహుజన పోరాటాలకు ప్రతీక

📰 Generate e-Paper Clip

భావితరాలకు చాకలి ఐలమ్మ ఆదర్శం   

అణగారిన వర్గాల ఆత్మగౌరవం 

A2 న్యూస్, తూప్రాన్ ప్రతినిధి (పెద్దింటి సత్యం) సెప్టెంబర్ 11:

తూప్రాన్ (10) తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను గురువారం మంగళపర్తిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, రజక సంఘం సభ్యులు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.కార్యక్రమంలో రజక సంఘం ప్రధాన కార్యదర్శి చంద పురం శేఖర్ రజక సంఘ నాయకులు యాదయ్య మైసయ్య షేకులు శ్రీనివాస్ రమేష్ ప్రభాకర్ కోట గడ్డ రఘుపతి గొల్ల శ్రీనివాస్ శంకర్రావు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని చాకలి ఐలమ్మకు నివాళులర్పించారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!