Thursday, October 15, 2026
Homeమెదక్మహాత్మా గాంధీ ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయం

మహాత్మా గాంధీ ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయం

📰 Generate e-Paper Clip

– జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 3:

మెదక్ జిల్లా (2) మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ అహింస, సత్యాగ్రహ మార్గాలతో ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చారని తెలిపారు. సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం వంటి ఆయన ఆశయాలు నేటికీ అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. గాంధీజీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడిచి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఏఓ యునాస్‌తో పాటు అధికారులు, సిబ్బంది గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!