మహాత్మా గాంధీ ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయం
– జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 3: మెదక్ జిల్లా (2) మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ అహింస, సత్యాగ్రహ మార్గాలతో ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చారని తెలిపారు. సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం వంటి ఆయన ఆశయాలు నేటికీ అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు....