A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 3:
నర్సాపూర్ (2) ధరణి, భూభారతి రికార్డుల పైన విచారణ జరిపించాలని అలాగే స్వతంత్ర సంస్థతో 22/A భూములపై విచారణ జరిపించి రైతులకు భూ యజమానులకు న్యాయం జరిపించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మెదక్ జిల్లా డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ లుముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22/A భూముల విషయంలో ప్రజలకు పూర్తి సమాచారం అందించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. పేదలకు న్యాయం జరిగే వరకు భూముల అంశంపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.22/A నిషేధిత జాబితాలో ఉన్న భూముల పూర్తి జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అర్హులైన పేదలకు భూములు పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

