తెలంగాణ ఉద్యమంలో బాపూజీది చెరగని ముద్ర
మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 28:
మెదక్ జిల్లా (27) ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. జిల్లా డీఎస్పీ ప్రసన్న కుమార్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యోద్యమంతో పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తిగా బాపూజీ నిలిచారని పేర్కొన్నారు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి, స్వశక్తితో ఎదిగిన బాపూజీ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం, సామాజిక అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. బాపూజీ ఆశయాలను స్మరించుకోవడం, వాటిని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు మహేష్, శైలేందర్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

