A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్ ) ఆగస్ట్ 26 :
నర్సాపూర్ (25) పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి కృషి చేయాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం నర్సాపూర్ అర్బన్ పార్క్‌లో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. సకాలంలో వర్షాలు పడాలన్నా, వాతావరణ పరిస్థితులను తట్టుకోవాలన్నా చెట్లు ఎంతో అవసరమని వీటి ప్రాధాన్యతను గుర్తించి తనవంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు చెట్ల పెంపకానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్, వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్లు, అటవీ శాఖ అధికారులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

