ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: ఎమ్మెల్యే సునీత రెడ్డి

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్ ) ఆగస్ట్ 26 : నర్సాపూర్ (25) పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి కృషి చేయాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు.  మంగళవారం నర్సాపూర్ అర్బన్ పార్క్‌లో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. సకాలంలో వర్షాలు పడాలన్నా, వాతావరణ పరిస్థితులను తట్టుకోవాలన్నా...