అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలకు నో.. చట్ట ఉల్లంఘనపై కఠిన చర్యలు: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
A2న్యూస్, జులై 2, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా (1)జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా జులై 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్–1861లోని సెక్షన్ 30, 30(ఎ) అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.ఈ కాలంలో పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక చర్యలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. శాంతిభద్రతల నిర్వహణకు భంగం కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు శాఖ చేపడుతున్న చర్యలకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

