A2 న్యూస్, జూన్ 30, మెదక్ ప్రతినిధి (ఆకుల యాదగిరి)
మెదక్ (29) మెదక్ జిల్లా కలెక్టర్ ను సోమవారం జిల్లా మైనార్టీ చైర్మన్ సుఫీ జానీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల మెదక్ జిల్లా మైనార్టీ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో మైనార్టీల అభ్యున్నతి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు పరస్పర సహకారంతో పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ అమీరుద్దీన్, మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్యాంసుందర్, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అదిల్ పాషా, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ షేక్ అక్బరుద్దీన్, షేక్ ఫస్యుద్దీన్, యూత్ కాంగ్రెస్ మండల వైస్ ప్రెసిడెంట్ షేక్ కాజా, ఎజాజ్, షానవాజ్, నదీమ్, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.

