A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 6:
చేగుంట (5) విద్యార్థినులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని తూప్రాన్ డీఎస్పీ శ్రీ జె. నరేందర్ గౌడ్ సూచించారు. చేగుంటలోని కస్తూరిబా బాలికల విద్యాలయంలో గురువారం నిర్వహించిన సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు. నకిలీ స్టాక్ మార్కెట్ పెట్టుబడి ప్రకటనలు, ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగే మోసగాళ్లు, ఓటీపీలు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. ఏదైనా సైబర్ మోసానికి గురైన వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు లేదా సైబర్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, స్థానిక ఎస్సై భిక్య నాయక్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

