చేగుంట కస్తూరిబా బాలికల విద్యాలయంలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 6: చేగుంట (5) విద్యార్థినులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని తూప్రాన్ డీఎస్పీ శ్రీ జె. నరేందర్ గౌడ్ సూచించారు. చేగుంటలోని కస్తూరిబా బాలికల విద్యాలయంలో గురువారం నిర్వహించిన సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు. నకిలీ స్టాక్ మార్కెట్ పెట్టుబడి ప్రకటనలు, ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగే మోసగాళ్లు, ఓటీపీలు, బ్యాంకు వివరాలు,...