Thursday, July 30, 2026
Homeతెలంగాణహైదరాబాద్అఖిల సనాతన సంఘటన్ తెలంగాణరాష్ట్రఅధ్యక్షుడిగా డాక్టర్ పి.సి. ఆదిత్య

అఖిల సనాతన సంఘటన్ తెలంగాణరాష్ట్రఅధ్యక్షుడిగా డాక్టర్ పి.సి. ఆదిత్య

📰 Generate e-Paper Clip

A2న్యూస్, జులై 5, ప్రత్యేక ప్రతినిధి (మల్పర్తి రాంచందర్)

హైదరాబాద్ (4) ప్రముఖ సినీ దర్శకులు డాక్టర్ పి.సి. ఆదిత్య అఖిల సనాతన సంఘటన్ తెలంగాణరాష్ట్రఅధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు అఖిల సనాతన సంఘటన జాతీయ అధ్యక్షుడు కేతన్ భాయ్ పర్మార్ ఉత్తర్వులు జారీ చేశారు. భారతీయ సనాతన సాంప్రదాయాల పరిరక్షణకు జాతీయ స్థాయిలో కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ అఖిల సనాతన సంఘటన్ అహ్మదాబాద్, గుజరాత్ దేశవ్యాప్తంగా కమిటీలను నియమిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా సామాజికవేత్త సినీ దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్యను నియమిస్తూ భారతీయ సనాతన సంప్రదాయాలు పట్ల విశ్వాసం, ఆచరణలో తన వంతు కృషి చేస్తున్న సంఘ సేవకుడు డాక్టర్ పి సి ఆదిత్యను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం తమ సంస్థకుగర్వకారణంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి సి ఆదిత్య స్పందిస్తూ భారతీయ సనాతన సాంప్రదాయాల పరిరక్షణకు తెలంగాణ రాష్ట్రంలో గో రక్షణ, గో సేవలతో పాటు సాంప్రదాయ కళల పోషణకు పరిరక్షణకు తనవంతు కర్తవ్యం గా దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా బహుళప్రచారంచేయనున్నామని, ఇందుకు గాను త్వరలో తెలంగాణలో అన్ని జిల్లాలలో పర్యటించి జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. రాష్ట్రస్థాయిలో తనకు ఈ అవకాశం కల్పించిన జాతీయ అధ్యక్షుడు కేతన్ భాయ్ పర్మార్ కు ఆదిత్య కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!