Tuesday, October 13, 2026
Homeమెదక్సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రణాళిక రూపొందించాలి

సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రణాళిక రూపొందించాలి

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 1:

నర్సాపూర్ (30) పట్టణంలో పారిశుద్ధ్య, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రణాళిక రూపొందించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగాహాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సాపూర్ పట్టణంలో పూర్తిస్థాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలని, పట్టణ అభివృద్ధిలో భాగంగా ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చి వార్డుల వారిగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడకుండా కూరగాయల మార్కెట్ కు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే సునీత రెడ్డి తో పాటు మున్సిపల్ చైర్మన్ లక్ష్మీరాజు యాదవ్, వైస్ చైర్మన్ బుచేష్ యాదవ్, కమిషనర్ సాయికుమార్, వార్డు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!