సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రణాళిక రూపొందించాలి

ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 1: నర్సాపూర్ (30) పట్టణంలో పారిశుద్ధ్య, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రణాళిక రూపొందించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగాహాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సాపూర్ పట్టణంలో పూర్తిస్థాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలని, పట్టణ అభివృద్ధిలో భాగంగా ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చి వార్డుల వారిగా ఉన్న సమస్యలను...