Tuesday, October 13, 2026
Homeమెదక్37 ఏళ్ల పోలీస్ సేవలకు ఘన వీడ్కోలు

37 ఏళ్ల పోలీస్ సేవలకు ఘన వీడ్కోలు

📰 Generate e-Paper Clip

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 1:

మెదక్ జిల్లా (30) పోలీస్ శాఖలో 37 ఏళ్ల పాటు సేవలందించి పదవీ విరమణ పొందిన హవేలీఘనపూర్ ఎస్‌ఐ సత్యనారాయణకు జిల్లా పోలీస్ శాఖ ఘన వీడ్కోలు పలికింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సత్యనారాయణను శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. 1989లో కానిస్టేబుల్‌గా చేరిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఎస్‌ఐగా పదోన్నతి పొందారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో అంకితభావంతో పనిచేశారని ఎస్పీ కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కుటుంబంతో ప్రశాంతంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సీఐలు, పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!