10 వేల జరిమానా.. పోలీసు అధికారులకు ఎస్పీ అభినందనలు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 1:
మెదక్ జిల్లా (30) అదనపు కట్నం కోసం భార్యను వేధించి, రాయితో తలపై కొట్టి హత్య చేసిన కేసులో భర్త బుచ్చ అశోక్‌కు మెదక్ జిల్లా ప్రధాన న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు 10 వేల జరిమానా విధించింది. శివంపేట మండలం కొత్తపేటకు చెందిన అశోక్‌కు అల్లీపూర్‌కు చెందిన మినాతో వివాహం జరిగింది. అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడుతూ, 2023 మార్చి 2న పంచాయతీ సందర్భంగా మినాపై రాయితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మార్చి 5న మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. ప్రాసిక్యూషన్ బలమైన వాదనలు వినిపించడంతో కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధించింది. నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేసి, పటిష్టమైన ఆధారాలను కోర్టులో సమర్పించిన పోలీసు అధికారులు, సిబ్బందిని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అభినందించారు.

