37 ఏళ్ల పోలీస్ సేవలకు ఘన వీడ్కోలు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 1: మెదక్ జిల్లా (30) పోలీస్ శాఖలో 37 ఏళ్ల పాటు సేవలందించి పదవీ విరమణ పొందిన హవేలీఘనపూర్ ఎస్‌ఐ సత్యనారాయణకు జిల్లా పోలీస్ శాఖ ఘన వీడ్కోలు పలికింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సత్యనారాయణను శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. 1989లో కానిస్టేబుల్‌గా చేరిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఎస్‌ఐగా పదోన్నతి పొందారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో అంకితభావంతో పనిచేశారని ఎస్పీ కొనియాడారు. పదవీ విరమణ...