Tuesday, October 13, 2026
Homeమెదక్పరికిబండ గ్యాస్ సిలిండర్ లీకేజీ కేసులో ఇద్దరు రిమాండ్

పరికిబండ గ్యాస్ సిలిండర్ లీకేజీ కేసులో ఇద్దరు రిమాండ్

📰 Generate e-Paper Clip

A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 30:

మనోహరాబాద్ (29) పరికిబండ గ్రామంలో చోటుచేసుకున్న గ్యాస్ సిలిండర్ లీకేజీ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏ5 గుత్తుల కిరణ్, ఏ7 మంగా శ్రీనివాస్‌లను తూప్రాన్ సీఐ అరెస్ట్ చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరచగా కోర్టు రిమాండ్‌కు తరలించింది. ఏ5 గుత్తుల కిరణ్ (26), తండ్రి దుర్గాప్రసాద్, గౌడ్ సామాజిక వర్గానికి చెందినవాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న కిరణ్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామం కాగా, ప్రస్తుతం మెద్చల్ మండలం గుండ్లపోచంపల్లి గ్రామంలోని లక్ష్మీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఏ7 మంగా శ్రీనివాస్ (55), తండ్రి మల్లయ్య, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినవాడు. మిషన్ భగీరథ వాటర్ సప్లైలో హెల్పర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ పరికిబండ గ్రామం, మనోహరాబాద్ మండలం, మెదక్ జిల్లా వాసి. గ్యాస్ సిలిండర్లను రీఫిలింగ్ చేయడానికి ఉపయోగించిన షెడ్‌ను అద్దెకు ఇచ్చిన వ్యక్తిగా దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, గ్యాస్ సిలిండర్ లీకేజీ ఘటనకు సంబంధించి పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!