పరికిబండ గ్యాస్ సిలిండర్ లీకేజీ కేసులో ఇద్దరు రిమాండ్

A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 30: మనోహరాబాద్ (29) పరికిబండ గ్రామంలో చోటుచేసుకున్న గ్యాస్ సిలిండర్ లీకేజీ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏ5 గుత్తుల కిరణ్, ఏ7 మంగా శ్రీనివాస్‌లను తూప్రాన్ సీఐ అరెస్ట్ చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరచగా కోర్టు రిమాండ్‌కు తరలించింది. ఏ5 గుత్తుల కిరణ్ (26), తండ్రి దుర్గాప్రసాద్, గౌడ్ సామాజిక వర్గానికి చెందినవాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న కిరణ్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామం...