A2న్యూస్, నర్సాపూర్ /చిలప్ చెడు ప్రతినిధి (బుచ్చన్న) సెప్టెంబర్ 30:
చిలప్ చెడ్ (29) నర్సాపూర్ నియోజకవర్గ చిల్లప్ చేడు మండల టిపిటిఎఫ్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి రాష్ట్ర కౌన్సిలర్, జిల్లా ఉపధ్యక్షులు కే యాదగిరి తెలిపారు. మండల టిపిటిఎఫ్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ జాదవ్ గౌతాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రధాన కార్యదర్శిగా ఎస్ ప్రదీప్ కుమార్ ప్రాథమిక పాఠశాల గౌతాపూర్, ఉపాధ్యక్షులు సి శేఖర్ జడ్పిహెచ్ఎస్ గౌతాపూర్, మేరీ కృప ప్రాథమిక పాఠశాలబండపోతుగల్,కార్యదర్శులుగా విజయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమక్కపేట, కె విష్ణు ఉన్నత పాఠశాల సోమక్కపేట, పెబ్బి జడ్.పి.హెచ్.ఎస్ చండూర్ జిల్లా కౌన్సిలర్ గా ఎం నాగభూషణం, ఈ సందర్భంగా ఎన్నికల అధికారి రాష్ట్ర కౌన్సిలర్ సంగయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే 50 శాతం పి ఆర్ సి ఫిట్మెంట్ ప్రకటించాలని, రెండు డిఏలు తక్షణమే మంజూరు చేయాలని,3 టి+బడులకు వెంటనే న్యాయం చేయాలని, సి పి ఎస్ లు రద్దుచేసి ఓపీఎస్ ను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మండలకమిటీ ఏకగ్రీవం కావడం చాలా సంతోషకరమని ఈ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ యాదగిరి, మహమ్మద్ నజీరుద్దీన్ రాష్ట్ర కౌన్సిలర్, జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

