A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 24:
మెదక్ జిల్లా (23) సెప్టెంబర్ 23: గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్లను సబ్సిడీపై పొందుతున్న వినియోగదారులు అక్టోబర్ 1, 2026లోపు ఆధార్ ఆధారిత ఈ కేవైసీ(బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్) పూర్తి చేసుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నిత్యానంద తెలిపారు. ఇప్పటికే ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వినియోగదారులు మరోసారి ఈ కేవైసీ చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఈ కేవైసీ పూర్తి చేయని వినియోగదారులు ఎల్పిజి సిలిండర్ డెలివరీ సమయంలో ఇంటి వద్దకు వచ్చే డెలివరీ సిబ్బంది ద్వారా, సంబంధిత ఎల్పిజి ఏజెన్సీ/డిస్ట్రిబ్యూటర్ వద్ద లేదా ఆయా ఆయిల్ కంపెనీల మొబైల్ యాప్ల ద్వారా ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. ఇండియన్ వినియోగదారులు. ఇండియన్ ఆయిల్ వన్ భారత్ గ్యాస్ వినియోగదారులు హెల్లో బిపిసిఎల్ , హెచ్.పీ గ్యాస్ వియోగదారులు హెచ్ పి పే మొబైల్ యాప్ల ద్వారా ఇంటి నుంచే ఈ కేవైసీ పూర్తి చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ కేవైసీ ప్రక్రియ ద్వారా సబ్సిడీ ప్రయోజనం అర్హత కలిగిన నిజమైన వినియోగదారులకు మాత్రమే అందేలా చూడటంతో పాటు, డూప్లికేట్ లేదా అనర్హమైన ఎల్పిజి కనెక్షన్లను గుర్తించి నివారించేందుకు వీలు కలుగుతుందని అధికారి పేర్కొన్నారు. కావున ఈ కేవైసీ పూర్తి చేయని ఎల్పిజి వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్టోబర్ 1లోపు పై మూడు మార్గాల్లో ఏదైనా ఒకదాని ద్వారా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎల్ పి జ సేవలకు సహాయం కోసం టోల్ఫ్రీ నంబర్: 1800 2333 55ను సంప్రదించవచ్చు.

