A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 20:
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా సినీ రంగంలో నిత్య ప్రయోగశీలి, సినీ కేసరి డాక్టర్ పి సి ఆదిత్య ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా మూవీ చాయివాలా చిత్రానికి సంబంధించిన పోస్టర్ ని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ఆవిష్కరించి చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా రామచంద్ర రావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తిని కలిగించినటువంటి మోడీ స్ఫూర్తితో డాక్టర్ పి సి ఆదిత్య నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చాయ్ వాలా చిత్రం తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా విడుదలై ఘనవిజయంసాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, నటుడు డాక్టర్ పి సి ఆదిత్యమాట్లాడుతూ రామచంద్ర రావు చేతుల మీదుగా చాయ్ వాలా పోస్టర్ ఆవిష్కరణ జరగడం మా యూనిట్ కి శుభసూచనగాభావిస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు.

