A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 3:
నర్సాపూర్ (2) ఆచరణకు సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ప్రజా సంక్షేమానికి పాటుపడకుండాహామీలతోనే కాలయాపన చేస్తూ ప్రజలను మోసంచేస్తుందని ఇది బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలన వెయ్యి రోజులు దాటినా 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని నర్సాపూర్ లో బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పెద్ద ఫ్లెక్సీలో ముద్రించి వాటిని నర్సాపూర్ ప్రధాన రోడ్డు కుండా ప్రదర్శిస్తూ చౌరస్తా వద్దకు చేరుకొని తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఎన్నో పథకాలు పెట్టిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాటల గారడి తో లేనిపోని కలబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి పరిపాలన కూడా మోసపూరిత పాలన చేస్తుందని విమర్శించారు. 6 గ్యారంటీలు ఇస్తామని, ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని చెప్పి వాళ్ళ సంక్షేమాన్ని చూసుకుంటూ ప్రజాసంక్షేమాన్నివిస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మోసాలనుఎండగట్టేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలను మోసం చేస్తుంటే బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు ఇప్పటినుండే సిద్ధమయ్యారని ఆమె అన్నారు.
ఈకార్యక్రమంలో కౌన్సిలర్లు పంబల్ల బిక్షపతి, బాల్ రెడ్డి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇరు పార్టీల కార్యక్రమాలతో సందడిగా మారిన నర్సాపూర్
డిజైన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో బుధవారం బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలతో నర్సాపూర్ పట్టణ మొత్తం సందడిగా మారింది. భూభారతి, ధరణి పై విచారణ జరిపించి అర్హులైన పేదలకు పంచాలని బిజెపి కార్యక్రమం చేపట్టగా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు చేస్తున్న మోసాలను ఎండగడుతూ బిఆర్ఎస్ పార్టీ ఆందోళన చేపట్టింది. దీంతో ఇరు పార్టీల కార్యక్రమాలతో నర్సాపూర్ పట్టణం మొత్తంసందడిగామారింది.

