Sunday, September 13, 2026
Homeమెదక్ఏకరూప దుస్తులతో విద్యార్థుల్లో సమానత్వ భావన

ఏకరూప దుస్తులతో విద్యార్థుల్లో సమానత్వ భావన

📰 Generate e-Paper Clip

A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 3:

మనోహరాబాద్ (2) పోతారం గ్రామంలోని యుపిఎస్ పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల (యూనిఫాం) పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పుట్ట వినోద మహేందర్ విద్యార్థులకు యూనిఫాంలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. విద్యార్థుల మధ్య ఉన్న ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగించి, అందరూ సమానమేననే భావనను పెంపొందించడంలో ఏకరూప దుస్తులు ఎంతో దోహదపడతాయని అన్నారు. విద్యార్థుల్లో సమానత్వ భావనతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధి, సమానత్వం, మెరుగైన విద్య కోసం గ్రామస్థాయిలో ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ రజిత, యుపిఎస్ పాఠశాల హెడ్‌మాస్టర్ మాధవి, సీఏ దుర్గం కవిత, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!