Monday, September 14, 2026
Homeమెదక్అభివృద్ధి బాటలో గ్రామాలు.. వికసిత్ ప్రణాళికకు శ్రీకారం

అభివృద్ధి బాటలో గ్రామాలు.. వికసిత్ ప్రణాళికకు శ్రీకారం

📰 Generate e-Paper Clip

A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 3:

మనోహరాబాద్ (2) వికసిత్ భారత్‌–2047 లక్ష్య సాధనలో భాగంగా గ్రామాల సమగ్ర అభివృద్ధికి రూపొందిస్తున్న వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక (వి జి పి పి)పై మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. జీడిపల్లి గ్రామంలో ఎంపీడీవో కృష్ణమూర్తి ఆధ్వర్యంలో, వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో ఏపీవో ఆదినారాయణ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు. అలాగే కోనాయపల్లి పీటీ, దండుపల్లి గ్రామాల్లో ఈసీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గ్రామ సభలు జరిగాయి. ఈ సందర్భంగా గ్రామాల అవసరాలు, ప్రజల ప్రాధాన్యతలను గుర్తించి వివిధ రంగాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలో పొందుపర్చే అంశాలపై చర్చించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వికసిత్ భారత్‌–2047 లక్ష్యానికి అనుగుణంగా గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే (వి జి పి పి) ప్రణాళిక ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!