అభివృద్ధి బాటలో గ్రామాలు.. వికసిత్ ప్రణాళికకు శ్రీకారం
A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 3: మనోహరాబాద్ (2) వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో భాగంగా గ్రామాల సమగ్ర అభివృద్ధికి రూపొందిస్తున్న వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక (వి జి పి పి)పై మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. జీడిపల్లి గ్రామంలో ఎంపీడీవో కృష్ణమూర్తి ఆధ్వర్యంలో, వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో ఏపీవో ఆదినారాయణ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు. అలాగే కోనాయపల్లి పీటీ, దండుపల్లి గ్రామాల్లో ఈసీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గ్రామ సభలు జరిగాయి. ఈ సందర్భంగా గ్రామాల...