A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 3:
మనోహరాబాద్ (2) పోతారం గ్రామంలోని యుపిఎస్ పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల (యూనిఫాం) పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పుట్ట వినోద మహేందర్ విద్యార్థులకు యూనిఫాంలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. విద్యార్థుల మధ్య ఉన్న ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగించి, అందరూ సమానమేననే భావనను పెంపొందించడంలో ఏకరూప దుస్తులు ఎంతో దోహదపడతాయని అన్నారు. విద్యార్థుల్లో సమానత్వ భావనతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధి, సమానత్వం, మెరుగైన విద్య కోసం గ్రామస్థాయిలో ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ రజిత, యుపిఎస్ పాఠశాల హెడ్‌మాస్టర్ మాధవి, సీఏ దుర్గం కవిత, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.