ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి: సర్పంచ్ కందాల రాజ నరసింహ
A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 2:
మనోహరాబాద్ (1):పర్యావరణ పరిరక్షణకు, జీవవైవిధ్య మనుగడకు చెట్లు ఎంతో కీలకమని ముప్పిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ కందాల రాజ నరసింహ అన్నారు. ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో సర్పంచ్ కందాల రాజ నరసింహ పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు జీవవైవిధ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. ప్రకృతి బాగుంటేనే మనిషి ఆరోగ్యంగా, సంతోషంగా జీవించగలడని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

