A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 2:
మెదక్ జిల్లా ( 1) ఎస్ఐఆర్ నోటీసుల జారీ, విచారణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పిల్లికొట్టాల్ 12వ వార్డులో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ నోటీసుల విచారణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా విచారణకు సంబంధించిన ఆధారాలను పూర్తిస్థాయిలో సేకరించి, వాటిని సంబంధిత యాప్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. పిల్లికొట్టాల్లో మొత్తం 124 ఎస్ఐఆర్ నోటీసులు జారీ కాగా, ఇప్పటివరకు 91 నోటీసులకు విచారణ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. ఎలాంటి తప్పిదాలకు, అవకతవకలకు తావులేకుండా విచారణ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
మిగిలిన నోటీసుల విచారణను కూడా వేగవంతంగా పూర్తి చేసి, సంబంధిత వివరాలను యాప్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి, మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

