Thursday, August 6, 2026
Homeమెదక్సోషల్ మీడియా, ఏఐ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలి :శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు కె....

సోషల్ మీడియా, ఏఐ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలి :శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు కె. విష్ణు రాజు

📰 Generate e-Paper Clip

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 4:

నర్సాపూర్ (3) విద్యార్థులు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా, ఏఐ కృత్రిమ మేధ విషయంలో అప్రమత్తంగా ఉండాలని శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు కె. విష్ణు రాజు సూచించారు. బి.వి.రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ), నర్సాపూర్‌లో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం నిర్వహించిన 30వ ఇండక్షన్ డే (పరిచయ కార్యక్రమం) సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నూతన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు కె. విష్ణు రాజు నూతన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను బీవీఆర్ఐటీ కుటుంబంలోకి హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ మీడియా మరియు కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.సాంకేతికతను అభ్యాసానికి తోడ్పడే సాధనంగాఉపయోగించుకోవాలని, మానవ ఆలోచనకుప్రత్యామ్నాయంగా భావించకూడదన్నారు. నకిలీ వార్తలను నమ్మడం, వాటిని ప్రచారం చేయడం సమాజానికి హానికరమని హెచ్చరించారు.బహుముఖ నైపుణ్యాలను పెంపొందించుకొని,పట్టుదలతో లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్ మాట్లాడుతూ, సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అనంతరం  కళాశాల ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే మాట్లాడుతూ, అత్యుత్తమ ప్లేస్మెంట్లు, ఉన్నత విద్య, పరిశోధన, వ్యవస్థాపకత, సామాజిక బాధ్యత వంటి రంగాల్లో బీవీఆర్ఐటీ విశిష్ట గుర్తింపు సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డిప్యూటీ జనరల్ మేనేజర్ కాంతారావు,అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ బి. బాపిరాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేష్,అన్నివిభాగాధిపతులు, డీన్లు, అధ్యాపకులు, బోధన, బోధనేతర సిబ్బంది, నూతన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!