సోషల్ మీడియా, ఏఐ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలి :శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు కె. విష్ణు రాజు

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 4: నర్సాపూర్ (3) విద్యార్థులు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా, ఏఐ కృత్రిమ మేధ విషయంలో అప్రమత్తంగా ఉండాలని శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు కె. విష్ణు రాజు సూచించారు. బి.వి.రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ), నర్సాపూర్‌లో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం నిర్వహించిన 30వ ఇండక్షన్ డే (పరిచయ కార్యక్రమం) సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నూతన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు....